బైరెడ్డిని తదేపా నుంచి సస్పెండ్‌ చేయాలి

హైదరాబాద్‌: వచ్చిన తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబునాయుడు మరోమారు తెలంగాణ వస్తుందన్న ప్రచారంతో రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఉర్యమానికి అజ్యం పోస్తున్నారని తెరాసనేత హరీష్‌రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో హరీష్‌రావు మాట్లాడుతూ, పరకాల ఉప ఎన్నికల సమయంలో తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పిన చంద్రబాబు… తన పార్టీ నాయకుడు ప్రత్యేక రాయలసీమ అంటే ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలమే అయితే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో శంషాబాద్‌ విమానాశ్రయం దిగ్బంధానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. కృష్ణాడెల్టా ప్రాంతానికి సాగర్‌ నీళ్లు తరలిస్తే తప్పక తిరగబడతామని హరీష్‌రావు అన్నారు.