బోధనారుసుములపై మాట్లాడే హక్కు తెదేపాకు లేదు: బొత్స

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీకి బోధనా రుసుంపై మాట్లాడే హక్కు  లేదని పీసీసీ అధినేత బొత్స వ్యాఖ్యానించారు. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్‌ కళాశాలల్లో చదివిన వారికి బోధనా రుసుం చెల్లించాలని అడగడం సమంజసమా? అని ప్రశ్నించారు. గాంధీభవన్‌లో బొత్స మీడియాతో మాట్లాడారు. రుసుముల చెల్లంపులపై తెదేపా వైఖరిని తప్పుబట్టారు. వైఎస్‌ వారసులు ఎం చేస్తున్నారో మాకు అవసరం అఏదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.