బోరుబావి నుండి చిన్నారిని బయటకు తీసిన సిబ్బంది

86గంటల తరువాత బోరుబా నుంచి చిన్నారి మహీని రక్షణ సిబ్బంది బయటకు తీసుకువచ్చారు. మహిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. బోరుబావికి సమాంతరంగా గుంతను తవ్విన సిబ్బంది 86గంటల తరువాత చిన్నారి పడిన చోటును చేరుకున్నారు. హర్యానాలోని మానేసర్‌ పట్టణం సమీపాన కషాస్‌ గ్రామంలో మహీ బుధవారం బోరుబావిలో పడిపోయింది. అప్పటి నుంచి చిన్నారిని రక్షించేందుకు సైన్యం, అగ్నిమాపక, పోలీసులు, ఆరోగ్య, రెవెన్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.