భానుకారణ్‌ అనుచరుడు వంశీ అరెస్ట్‌

హైదరాబాద్‌: మద్దులచెరువు సూర్యనారాయణరెడ్డి అలియాస్‌ సూరిహత్య కేసులో మరోనిందితుడు, బానుకిరణ్‌ అనుచరుడు వంశీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జులై 9 వరకు కోర్టు రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.