భారత్‌ మాకు సహజ భాగస్వామి

` పుతిన్‌ మరోసారి ప్రశంసలు
మాస్కొ(జనంసాక్షి):రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత్‌పై మరోసారి ప్రశంసలు కురిపించారు. తమ దేశానికి భారత్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. భారత్‌` రష్యాల మధ్య సంబంధాలు అన్నివిధాల అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈమేరకు సోచిలోని వాల్డాయ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక వార్తాసంస్థలు వెల్లడిరచాయి.’భారత్‌ ఓ గొప్ప దేశం. ఆ దేశంతో మా సంబంధాలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద ఆర్థికవ్యవస్థలతో ఆర్థికవృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుంది. మా సంబంధాలు ఎక్కడ, ఎంత వేగంగా అభివృద్ధి చెందుతాయనేది నేటి వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి నిలయమైన భారత్‌కు ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి అర్హత ఉంది. భద్రత, రక్షణరంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. ఏడాదికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్‌ డాలర్లుగా ఉంది’ అని పుతిన్‌ పేర్కొన్నారు.ఇక, ఇరుదేశాల మధ్య ఉమ్మడి సహకారానికి బ్రహ్మోస్‌ను ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది భారత్‌` రష్యాల మధ్య విశ్వాసానికి, భవిష్యత్తులో భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఉమ్మడి కరెన్సీని సృష్టించే లక్ష్యాలు లేవని వెల్లడిరచారు. ఈసందర్భంగా భారతదేశానికి స్వాతంత్య్రం ఆవిర్భవించడంలో సోవియెట్‌ యూనియన్‌ పాత్రను పుతిన్‌ గుర్తుచేసుకున్నారు. ఇటీవల రష్యాలోని కజన్‌ వేదికగా జరిగిన 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత ఆర్థికవృద్ధి విజయవంతంగా ముందుకెళ్తుందంటూ ప్రశంసించారు.