మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని త్రివేణి గార్డెన్స్ లో నిర్వహించిన మంత్రి జన్మదిన వేడుకల్లో మంత్రి జగదీష్ రెడ్డిని తెలంగాణ ఆర్ఎంపీ,పీఎంపీ సంక్షేమ సంఘ జిల్లా నాయకులు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో తమ సంఘ భవన నిర్మాణానికి మంత్రి జగదీష్ రెడ్డి
భూమిని కేటాయించడంతో పాటు నిధులను మంజూరు చేశారని అన్నారు.భగవంతుడు మంత్రికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి రాజేందర్, సహా అధ్యక్షులు షేక్ రహామతుల్లా, సంఘ నాయకులు రాజబాబు రెడ్డి, లక్ష్మణ్ , డాంగే గౌడ్ తదితరులు పాల్గొన్నారు.