మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలి: శంకర్రావు

హైదరాబాద్‌: సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలని మాజీ మంత్రి శంకర్రావు డిమాండ్‌ వ్యక్తం చేశారు. కెప్టెన్‌ జట్టులో రెండో వికెట్‌ పడిపోయిందని, మరో ఆరు వికెట్లు కూడా అందుకు సిద్ధంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రులకు న్యాయసహాయం అందించాలని ఇచ్యిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించాలని కోరారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ అడిగేందుకు కూడా ఎవరూ ముందుకు రారని దీనిపై సోనియాగాంధీ, రాహుల్‌లకు లేఖలు కాడా రాశానని ఆయన అన్నారు.