మంత్రులు, ఎమ్మెల్యేలు సహనంతో ఉండాలి: ముఖ్యమంత్రి

తూర్పుగోదావరి: ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా మ్యుఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రంపచోడవరంలో శనివారం పర్యటించిన సీఎం ఇవాళ అమలాపురంలో పర్యటించనున్నారు. అమలాపురం బయల్దేరే ముందు రంపచోడవరంలో సీఎం మీడియాతో మాట్టాడారు. మంత్రులు, ఎమ్యెల్యేలు సహనంతో ఉండాలని  సూచించారు. ఐఏఎస్‌లపై మంత్రి టీజీ వెంకటేష్‌ చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని తెలియజేశారు. ఉపాధిహామీని వ్యవసాయంతో అనుసంధానం చేయాలన్న అంశాన్ని  ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.