మద్నూర్ లో శీతల్ ఉత్సవం


జుక్కల్, మార్చి 14,( జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో రాజస్థాన్ సమాజ్ (మార్వాడీ) వారు మంగళవారం శీతల్ ఉత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా ఒక రోజు ముందు వండిన చల్లటి వంటలు పండుగ రోజు తినడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి వేడి పదార్ధాలు వండటం జరగదని వివరించారు. హోళి పండుగ తర్వాత వారం రోజులకు పండుగ జరుపుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.