మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా కేసులకు త్వరగా పరిష్కారం : న్యాయమూర్తి అల్తమన్ కబీర్
హైదరాబాద్: కేసుల పరిష్కారంలో మధ్యవర్తిత్వ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమన్ కబీర్ అన్నారు. సిటీ సివిల్ కోర్టులో ఆయన మధ్యవర్తిత్వం కేంద్రాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు త్వరగా పరిష్కారమవుతాయని అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా పెద్ద కేసులను కూడా సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న భూవివాద కేసులు దీని ద్వారా పరిష్కారమవుతాయని వెల్లడించారు. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే విధంగా ఈ కేంద్రాలు పనిచేస్తాయని చెప్పారు ఉచితంగా న్యాయసలహాలు పొందవచ్చని తెలిపారు.