మమ్మల్ని దిగిపొమ్మనే హక్కు కోదండరాంకు ఎక్కడిది: నాయిని

636009068769360067హైదరాబాద్: సీఎం కేసీఆర్‌‌పై కోదండరాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కోదండరాంను టార్గెట్ చేసిన మంత్రులు ఒక్కొక్కరు ఓ రేంజ్‌‌లో విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన హోంమంత్రి నాయిని కోదండరాంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కోదండరాం టీఆర్ఎస్‌తో కలిసి పనిచేశారా అంటూ ప్రశ్నించారు. మమ్మల్ని దిగిపొమ్మనే హక్కు మీకు ఎక్కడుందన్నారు.
కోదండరాం వెనక బాసులున్నారేమో.. మాకు బాసులు ప్రజలేని ఆయన చెప్పారు. మల్లన్నసాగర్ భూములకు, ఫాంహౌస్‌కు సంబంధం ఏమిటి..మల్లన్నసాగర్ బాధితులకు న్యాయం చేసి తీరుతామని నాయిని తెలిపారు. కోదండరామ్ విపక్ష నేతల మాదిరిగా మాట్లాడుతున్నారని నాయిని మండిపడ్డారు. మిషన్ భగీరథను కలలోనైనా ఊహించారా..అది టీఆర్ఎస్ కే సాధ్యమని ఆయన చెప్పారు. ఎక్కడైనా తప్పులు జరిగితే సరిచేసుకుంటామని నాయిని పేర్కొన్నారు.