మహిళల ఉద్యోగాల్లో వారినే నియమించాలి : కేసీఆర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీలో మహిళలకు కేటాయించిన ఉద్యోగాల్లో వారినే నియమించాలని తెరాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఇవాళ ఎల్బీనగర్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ మహిళా కండక్టర్ల, మహిళా ఉద్యోగులతో సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు హాజరైన కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు. కాంట్రాక్ట ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలతో సమాన వేతనం ఇస్తామన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలను జాతి నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలని కేసీఆర్‌ ఈ సభలో తీర్మానం చేశారు. ఇదే తీర్మానాన్ని ప్రథామ మంత్రి సోనియాగాంథీలకు లేఖ రూపంలో పంపుతామన్నారు. తెలంగాణపై వాయలార్‌ రవి వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. ఉద్యమాన్ని అవహేళన చేసేలా మట్లాడడం సబబు కాదన్నారు.

తాజావార్తలు