మైలవరంలో ‘సుకుమారుడు’ షూటింగ్‌ సందడి

మైలవరం( కృష్ణా): ప్రముఖ సినీనటుడు సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగానటిస్తున్న ‘సుకుమారుడు’ చిత్రం షూటింగ్‌ కృష్ణా జిల్లా మైలవరంలో మంగళవారం నుంచి జరుగుతుంది. ప్రవాస భారతీయుడు లక్కిరెడ్డి హనిమిరెడ్డికి చెందిన విశాలమైన కోటలో ఈ షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. హీరో ఆది, హీరోయిన్‌ నిషాఅగర్వాల్‌, ఇతర నటులపై దృశ్యాలను తెరకెక్కిస్తున్నారు. చిత్ర కాథాంశంలో భాగంగా హీరో తాతగా నటిస్తున్న కృష్ణాకు చెందిన కోటగా ఇక్కడి కోటను చిత్రీకరిస్తున్నట్లు హీరో ఆది తెలియజేశారు.