యాసంగి వరి క్షేత్రంలొ పరిశీలన.
నెన్నెల, ఫిబ్రవరి 25, (జనంసాక్షి )
యాసంగిలో సాగు చేసిన వరి క్షేత్రాలను శనివారం నెన్నెల వ్యవసాయ విస్తరణ అధికారి రాం చందర్ సందర్శించారు. మండలంలోని లంబాడి తండా, మన్నెగూడెం, ఖర్జీ, జంగాల్ పేట గ్రామాలను సందర్శించి రైతులకు క్షేత్ర స్థాయిలో సలహాలు, సూచనలు అందించారు. రైతులకు ప్రస్తుతం వరి పొలాల్లో ఎక్కువగా కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులు ఆశించే ప్రమాదం ఉన్నందున వాటికీ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. కాండం తొలిచే పురుగు నివారణకు కార్ టాప్ పైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు లీటర్ నీటికి లేదా క్లోరంట్రా నిల్ ప్రోల్ 0.3 మిల్లి లీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్ 0.6 గ్రా, మంకో జెబ్ 2.5 గ్రా లీటరు నీటికి లేదా కాసుగామైసిన్ 2.5 మిల్లి లీటర్ లీటరు నీటికి కలుపుకొని వాతావరణ పరిస్థితులను బట్టి పది లేదా పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని అవగాహనా పరిచారు. ఆయన వెంటనే జంగాల్ పేట సర్పంచ్ రావుల సత్యనారాయణ, రైతులు రావుల శ్రీనివాస్, చింత మధుకర్ తదితరులు ఉన్నారు.