రాజ్యాంగానికి ప్రమాదం పొంచివుంది

` కాంగ్రెస్‌ను గెలిపించండి
` రాయబరేలితో అనుబంధం విడదీయలేనిది
` ఇందిర నుంచి మమ్ములను ఆదరించారు
` నాలాగే ఇప్పుడు రాహుల్‌నూ ఆశీర్వదించండి
` మీ ప్రేమకు సదా రుణపడి ఉంటాం
` రాయ్‌బరేలీ సభలో సోనియా
` అమేథీ నుంచే రాజకీయ ఓనమాలు
` తనకు ఈ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం
` అమేథీతోనే ఉన్నాను..ఉంటాను కూడా
` ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ ఉద్వేగం
రాయబరేలి(జనంసాక్షి): తనను గతంలో ఆదరించినట్లుగానే తన తనయుడు రాహుల్‌ను కూడా రాయబరేలి ప్రజలు ఆదరించాలని, అతను విూ వెన్నంటి ఉంటాడని రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్‌ గాంధీని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్‌ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియాగాంధీ రాయబరేలిలో శుక్రవారంనాడు ప్రసంగించారు. సోనియాగాంధీతో పాటు ఆయన కుమారుడు, రాయబరేలి కాంగ్రెస్‌ అభ్యర్థి రాహుల్‌ గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు.చాలా కాలం తర్వాత విూ మధ్యకు రాగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంపీగా విూకు సేవలందించే అవకాశం నాకు కలిగించారు. నా జీవితంలో ఎప్పటికీ దీన్ని మరిచిపోలేను. గత వందేళ్లుగా ఈ గడ్డతో మా కుటుంబ అనుబంధం వేళ్లూనుకుని ఉంది. ఈ అనుబంధం గంగాజలంలా స్వచ్ఛమైనది. అవథ్‌, రాయబరేలిలో రైతుల ఆందోళనతో ఈ అనుబంధం మొదలైందని సోనియాగాంధీ పేర్కొన్నారు. రాయబరేలి ప్రజలు, మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ ద్వారా తాను నేర్చుకున్న పాఠాలే తన పిల్లలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీకి నేర్పానని చెప్పారు. రాయబరేలి ప్రజలకు ఇందిరాగాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేదని, ఆమె పనితీరును తాను చాలా దగ్గర నుంచి పరిశీలించానని, ఇక్కడి ప్రజలంటే ఆమెకు ఎనలేని అభిమానం ఉండేదన్నారు. ఇందిరాంగాంధీ నుంచి నేర్చుకున్న పాఠాలనే తాను తన పిల్లలకు చెప్పానని తెలిపారు. అందరినీ గౌరవించడం, బలహీనులను పరిరక్షించడం, ప్రజల హక్కులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడటం, ఎలాంటి భయాలకు తావీయకుండటం వంటి పాఠాలు వారికి నేర్పానని చెప్పారు. రాయబరేలి ప్రజల ప్రేమ కారణంగా తనకు ఒంటరిగా ఉన్నాననే భావన ఎప్పుడూ కలగలేదని సోనియాగాంధీ అన్నారు. ‘ఈరోజు నా కుమారుడిని విూ చేతుల్లో పెడుతున్నాను. అతన్ని ఆదరించండి. నన్ను ఎలా ఆదరించాలో నా కుమారుడిని కూడా గుండెల్లో పెట్టుకోండి. రాహుల్‌ విూ ఆశలను వమ్ము చేయడు‘ అంటూ సోనియాగాంధీ భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్‌ గాంధీ ప్రస్తుతం పోటీ చేస్తున్న రాయబరేలి నియోజకవర్గానికి సోనియాగాంధీ 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మే 20న రాయబరేలిలో పోలింగ్‌ జరుగనుంది.
అమేథీ నుంచే రాజకీయ ఓనమాలు
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ అమేథీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అమేథీ నుంచే తాను రాజకీయాలు నేర్చుకున్నానని, తాను వారితోనే ఉన్నానని, ఉంటానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో కాంగ్రెస్‌, ఇండియా కూటమి అభ్యర్థి కేఎల్‌ శర్మ తరఫున శుక్రవారంనాడు ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు అఖిలేష్‌ కూడా ప్రచారానికి హాజరయ్యారు. ఐదో విడత పోలింగ్‌లో భాగంగా మే 20న అమేథీలో పోలింగ్‌ జరుగనుంది. రాహుల్‌ తన ప్రసంగంలో 42 ఏళ్ల క్రితం తన తండ్రి రాజీవ్‌ గాంధీతో కలిసి అమేథీకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాల గురించి తాను ఏది నేర్చుకున్నా అది ఇక్కడి (అమేథీ) నుంచే నేర్చుకున్నానని, ప్రజలే తనకు నేర్పారని చెప్పారు. తాను తొలిసారి అమేథికి వచ్చిన సమయంలో అప్పుడు రోడ్లు కానీ, అభివృద్ధి కానీ లేదన్నారు. తన తండ్రికి, అమేథీ ప్రజలకు మధ్య ఉన్న ప్రేమానుబంధానికి తానే సాక్షినని చెప్పారు. తాను కూడా ఇదే తరహా రాజకీయాలను పాటిస్తున్నానని తెలిపారు. తాను రాయబరేలి నుంచి పోటీ చేస్తున్నప్పటికీ అమేథీతో మొదట్నించీ తనకున్న అనుబంధం చెక్కుచెదరదని, ఎప్పటికీ అమేథీ ప్రజల వెన్నంటి ఉంటానని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలు చాలా కీలకమని రాహుల్‌ తెలిపారు. ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీ నేతలు రాజ్యాంగాన్ని తిరగరాస్తామని, రాజ్యాంగాన్ని బుట్టదాఖలా చేస్తామని తొలిసారి చాలా స్పష్టంగా చెబుతున్నారని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. రాజ్యాంగాన్ని చెరిపేద్దామా? రాజ్యాంగాన్ని తుడిచిపెట్టే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? అని ప్రజలను ఉద్దేశించి రాహుల్‌ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ప్రజలే పరిరక్షించుకోవాలని, రాజ్యాంగమే ప్రజా వాణి, ప్రజా భవిష్యత్తు అని స్పష్టం చేశారు. ఈ దేశంలో పేద ప్రజలకు ఏది చేసినా, రైతులకు సహాయపడినా, హరిత విప్లవం తెచ్చినా రాజ్యాంగంతోనే సాధించామని చెప్పారు. రాజ్యాంగానికి చరమగీతం పాడాలని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని, రాజ్యాంగం కనుమరుగైతే ఇక ప్రభుత్వ రంగమనేదే ఉండదని, ఉద్యోగాలు ఉండవని, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుందని, రిజర్వేషన్లకు స్వస్తి పలుకుతారని, ప్రజల హక్కులు ఒక్కొక్కటి ఊడలాక్కుంటారని రాహుల్‌ హెచ్చరించారు. కేవలం ఎంపిక చేసిన 22`25 మంది కుబేరుల కోసం రైతులు, కార్మికులు, యువత, తల్లులు, సోదరీమణుల హక్కులను హరిస్తారని ఆరోపించారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 140 సీట్లు సాధించడం కూడా కష్టమేనని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అన్నారు. నాలుగు విడతల ఎన్నికలు పూర్తయ్యే సరికే బీజేపీ ఓటమిదశకు చేరుకుందన్నారు. వారి రథం మునకలేస్తోందని, 400 సీట్లు తమ లక్ష్యమని నినాదాలిచ్చినా ప్రజలు 140 సీట్లకే పరిమితం చేయనున్నారని చెప్పారు. రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను మార్చాలనుకుంటున్న వారిని ప్రజలే మార్చాలనుకుంటున్నారని అన్నారు. అమేథీలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గాంధీ కుటుంబం విధేయుడుగా పేరున్న కిషోరి లాల్‌ శర్మ పోటీ చేస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీఎస్‌పీ అభ్యర్థిగా నాన్హె సింగ్‌ చౌహాన్‌ పోటీ పడుతున్నారు.
అమేథీ, రాయబరేలీల్లో గెలుస్తున్నాం: కాంగ్రెస్‌ నేత కెసి వేణుగోపాల్‌
ఈ లోక్‌సభ ఎన్నికల్లో ’ఇండియా’ బ్లాక్‌ అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్‌ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. ’మేము రాయబరేలి, అమేథీ రెండు స్థానాల్లో గెలుస్తాము. విూరు ఎక్కడికెళ్లినా ప్రజల మూడ్‌ని గమనిస్తే.. ’ఇండియా’ బ్లాక్‌కి అనుకూలంగా ఉంది.’ అని ఆయన అన్నారు. బిజెపి 150 సీట్లకు మించి గెలవదని రాహుల్‌ అనడాన్ని విూడియా ప్రతినిధులు వేణుగోపాల్‌ని ప్రశ్నించగా.. ’రాహుల్‌ దేశవ్యాప్తంగా పర్యటించారు. ఆయనకు ప్రజల పల్స్‌ తెలుసు. అందుకే బిజెపికి అంతకన్నా ఎక్కువ సీట్లు రావు అని రాహుల్‌ అంచనా.’ అని ఆయన అన్నారు. ªూగా, అమేథీ నుంచి ఇండియా బ్లాక్‌ అభ్యర్థి కె.ఎల్‌ శర్మ పోటీ చేస్తున్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ.. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ప్రచార ర్యాలీ నిర్వహించారు.