రైతుబంధు పథకం ప్రారంభం

కర్నూలు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇచ్చే 50 వేల రూపాయలను లక్ష రూపాయలకు పెంచుతున్నట్లు ఆయన తెలియజేశారు. రైతుకు వడ్డీలేని రుణాలను 70 శాతం మేరకు పెంచుతున్నట్లు ఆయన తెలియజేశారు. వడ్డీ శాతాన్ని 10 నుంచి 3 శాతానికి తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు.