రైతు సమస్యలపై క్షేత్రస్థాయి పర్యటనలు

హైదరాబాద్‌: రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగుదేశం క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నట్లు తెలుగుదేశం నేత కోడెల శివప్రసాద్‌ తెలిపారు. రైతులకు ఎరువులు, విత్తనాలు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి. బ్యాంకురుణాలు ఏవిధంగా లభిస్తున్నాయో తెలుసకునేందుకు తనిఖీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుంచి నిర్థిష్టమైన హామి లభించేంత వరకు పోరు సాగిస్తామన్నారు.