రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి

కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయరహదారిపై రామాపురం అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పరిటాలకు చెందిన తెదేపా నేత పోగంటి అప్పారావు (43) మృతి చెందాడు. హైదరాబాద్‌ నుంచి కంచికచర్లకు అప్పారావు కార్లో వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరిని విజయవాడ ఆసుపత్రికి తరలించారు.