వరంగల్ కార్పొరేషన్ 42 పంచాయితీల విలీనం
హైదరాబాద్ బ్యూరో : వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 42 గ్రామ పంచాయితీల్ని విలీనం చేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ పంపిన త్రిపాదనల మేరకు వీటికి ఆముదముద్ర వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కలెక్టర్ ప్రతిపాదనలపై పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు పరిశీలన అనంతరం చేసిన తీర్మానం మేరకు ఈ నిర్నయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.