విద్యుత్‌సమస్యలపై గవర్నర్‌ను కలిసిన తెదేపా నేతలు

హైదరాబాద్‌: విద్యుత్‌సమస్యలపై తెదేపా శాసనసభాపక్షం ఈరోజు గవర్నర్‌ను కలిసింది. విద్యుత్‌ కోతలతో వివిధ రంగాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వాటికి పరిస్కారం చూపాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. సమస్యల పరిష్కారంపై మాట్లాడకుండా అనవసర విషయాలపై మాత్రం ఛలోక్తులు విసిరారని మండిపడ్డారు. ఆయన స్పందనపై తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.