విద్యుత్ సౌధ వద్ద వైకాపా ధర్నా
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు యోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఖైరతాబాద్ విద్యుత్ సౌధ వద్ద వైకాపా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఒక్కసారిగా వచ్చిన కార్యకర్తలు, నేతలు కార్యలయంలోకి దూసుకుపోయే ప్రయత్నంచేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.