వినియోగదారుల హక్కులను కాపాడడమే మా లక్ష్యం
జనం సాక్షి, రామగిరి : ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్ లో గురువారం జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు నవీన్ శర్మ మాట్లాడుతూ.. వినియోగ దారుల హక్కులు కాపాడడమే మా సంస్థ ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. దేశంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తామని , అందుకొరకు సాయశక్తుల పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ అగర్వాల్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామగిరి హరిబాబు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండ శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కపాక సంపత్, జిల్లా ఉపాధ్యక్షులు అవునూరి భానుచందర్, మంథని లక్ష్మణ్, కామ తిరుపతి, వేల్పుల గట్టయ్య మరియు తెలంగాణ లోని అన్ని జిల్లాల నుండి నాయకులు పాల్గొన్నారు.