వివిధ జిల్లాల్లో పోలింగ్ శాతం..

హైదరాబాద్ : ఏపీ రెండు, తెలంగాణ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కాగా కొన్ని జిల్లాల్లో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 8.5 శాతం పోలింగ్ నమోదైనట్లు అంచనా. నల్గొండ లో 7.70, మహబూబ్ నగర్ లో 8, ఖమ్మంలో 5.05, కృష్ణా జిల్లాలో 20, గుంటూరులో 17, తూర్పుగోదావరి 21, విజయవాడ 17.7 ఓటింగ్ శాతం నమోదైనట్లు అంచనా.