వైఎస్‌కు నివాళులు అర్పించిన సీఎం, బొత్స

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మూడో వర్థంతి సందర్భంగా సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఘనంగా నివాళులు అర్పించారు. పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి వూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యాక్రమంలో మంత్రులు దానం, కాసులతోపాటు ఎంసీలు ఉండవల్లి, కేవీపీ తదితరులు పాల్గొన్నారు.