వైద్యుల సమ్మె ప్రతిపాదనలపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

న్యూఢిల్లీ : ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త వైద్యుల సమ్మెకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషనపై సుప్రీం కోర్టు తన విచారణకు వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ చేయాల్సి ఉన్న ధర్మాసనంలోని న్యాయయూర్తుల్లో ఒకరు విచారణ నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడమే ఇందుకు కారణం. న్యాయమూర్తుల్లో ఒకరైన జస్టిస్‌ రంజనా ప్రకాష్‌ దేశాయ్‌… తన భర్త కూడా వైద్యుడేననీ దరిమిలా తాను ఈ పిటిషన్‌పై విచారణ చేయడం నైతికంగా సబబు కాదంటూ వైదొలగారు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ (ఐఎంఏ)లో తన భర్త కూడా సభ్యుడేనని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.