శ్రీ రామస్వామి గుట్ట హనుమాన్ మందిరంలో హనుమాన్ భీక్ష.
కోటగిరి మార్చి 18 జనం సాక్షి:-పోతంగల్ మండల కేంద్రంలోని శ్రీరామ స్వామి గుట్ట హనుమాన్ మందిరంలో శనివారం రోజున పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ మాలాధార స్వాములకు బీక్షను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో హనుమాన్ స్వాములు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వాములకు బీక్ష ఏర్పాటు చేయడంతో పాటుగా భక్తులకు పద్మశాలి సంఘం సభ్యుల తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ ఆలయంలో గత 45 సంవత్సరాల నుండి పద్మశాలి సంఘం సభ్యులు స్వామి వారికి నిత్య పూజలు,ఆలయ అభివృద్ధి,అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.