సత్యం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వ అనుమతి

సత్యం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ ప్రమోటర్ల కుంటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ ప్రమోటర్లకు సంబంధించిన ఆస్తుల విలువ సుమారు 2.48 కోట్ల రూపాయల మేరకు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి. ఇది వరకే ఈ వ్యక్తులకు సంబంధించి మూడు కోట్ల 87లక్షల రూపాయల స్వాధీనానికి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 44 ఆస్తులు, సత్యం కంప్యూటర్ల కంపెనీ ప్రమోటర్లు,వారి కుటుంబ సభ్యులకు చెందిన ఏడు కీలక కంపెనీల పేర్లపై రిజిస్టర్‌ అయి ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఉత్తర్వులు ప్రభుత్వం ఇవాళ జారీ చేసింది.