సహకార ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తాం : బొత్స

హైదరాబాద్‌ : సహకార సంఘం ఎన్నికలను శాంతియుతంగా నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌ నుంచి సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని అర్థరాత్రి ఒంటరిగా తిరుగుతామా అని ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన ఘటనను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మాజీ మంత్రి అయినంత మాత్రాన చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని మాజీ మంత్రి కోడెలనుద్దేశించి అన్నారు. మంత్రి ఇంటిలో లేనపుడు ఇంటిమీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.