సామాజికవేత్త అన్నా హజారే బృందంలో నక్సలైట్లు

సత్నా: అన్నా హజురే బృందంలో నక్సలైట్లు ఉన్నారని వారితో సంబంధాలను తెంచుకున్న పక్షంలో హజారేకు తాను మద్దతిస్తానని జనతాపర్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. హజారేకు నా మద్దతు కావాలంటే ఆయన నక్సల్స్‌తో సంబంధాలను తెంచుకోవాలి అని సుబ్రహ్మణ్యస్వామి శనివారం విలేకరులతో అన్నారు. లోక్‌పాల్‌ బిల్లును మోదట ఆమోదించాలంటూ హజారే చేస్తున్న డిమాండ్‌తో తాను ఏకీభవించబోనని వివరించారు. 2జీ కుంభకోణం కేసులో ఆర్ధికశాఖ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు క్లీస్‌చిట్‌ ఇవ్వడంపై స్పందిస్తూ తీర్పును సమీక్షించాలని కోరుతూ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తానన్నారు.