స్పూర్తి దినంగా పాటించాలని ఐకాస పిలుపు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటన చేసి నేటికి మూడేళ్లవుతున్న సందర్భంగ నేడు స్ఫూర్తి దినంగా పాటించాలని తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా కొవ్వొత్తులు, కాగడాలతో ప్రదర్శన నిర్వహించాలని తెలంగాణవాదులను ఐకాస ఛైర్మన్‌ కోదండరాం కోరారు. మరోవైపు పల్లెబాట నిర్వహిస్తున్న తెరాస కూడా నేడు స్ఫూర్తి దినంగా పాటించనుంది.