హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తాం: డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్తామని ఉప ముఖ్యమంత్రి దామోదరి రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ అంశంపై ఈ రోజు ఉదయం సమీక్షా సమావేశం నిర్వహించిన రాజనర్సింహ అనంతరం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ప్రతిభ ఆధారంగానే యాజమాన్య కోటా భర్తీ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. జీవో 74 ప్రకారమే ప్రతిభ ఆధారంగా బీ కేటగిరీ సీట్లు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది అడ్మిషన్ల ప్రక్రియ ఖరారు చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్రలలో ఆధికారుల బృందం పర్యటించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి  తెలియజేశారు.