అంగన్వాడి కేంద్రంలోని బాల బాలికలకు అన్నప్రాసన

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 14(జనం సాక్షి)
            ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ  వరకు ప్రతి అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లులకు ఆరోగ్య సూత్రాలతో పాటు ఎటువంటి పోషక విలువలు కలిగిన పదార్థాలు తినాలో వారికి వివరించడం జరుగుతుందని 42వ డివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ అన్నారు.
            బుధవారం రోజున 42వ డివిజన్ లోని అంగన్వాడి కేంద్రంలో జరిగిన పోషణ మాసం కార్యక్రమంలో 42 డివిజన్ కార్పొరేటర్ పాల్గొని పోషణ ఆహారాల మీద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన కల్పించి, బాల బాలికలకు అన్నప్రాసన మరియు అక్షరాభ్యాసం చేయించినారు.
              ఈ సందర్భంగా గుండు చందన పూర్ణచందర్ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రుపాలు పట్టించి నట్లయితే పుట్టిన శిశువు శక్తితో పాటు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రతి అంగన్వాడి సెంటర్లో అంగన్వాడి టీచర్లు గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు అవగాహన చేయడం జరుగుతుందన్నారు.
          ఈ కార్యక్రమంలో సిడిపిఓ విశ్వజ, ఐసిడిఎస్ కి చెందిన డాక్టర్ రవితేజ, సూపర్వైజర్ పద్మలత, అంగన్వాడీ టీచర్లు గాయత్రి, అనసూయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Attachments area