అంగన్వాడి యూనియన్ నాయకుల అక్రమ అరెస్టును ఖండించిన సిపిఐ

అంగన్వాడి యూనియన్ నాయకుల అక్రమ అరెస్టును ఖండించిన సిపిఐ

టేకులపల్లి, అక్టోబర్ 4 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఉన్న అంగనవాడి యూనియన్ నాయకులను టేకులపల్లి పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకు అక్రమంగా అరెస్టు చేయడం పట్ల సిపిఐ పార్టీ ఖండించింది. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షురాలు వై ఇందిరా,సిఐటియు నాయకురాలు కల్తీ భద్రమ్మ,పద్మ,మంగమ్మ, జ్యోతిలను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ అక్రమ అరెస్టులను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ టేకులపల్లి మండల సమితి తీవ్రంగా ఖండించింది. సెప్టెంబర్ నెల 11వ తేదీ నుండి అంగనవాడి టీచర్స్, హెల్పర్స్ నిరవధిక సమ్మె టేకులపల్లి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట 23వ రోజు నిరసన నిరవధిక సమ్మె వివిధ రూపాలలో తెలియజేస్తూ ఈనెల నాలుగో తేదీ బుధవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ,సిఐటియు జేఏసీ పిలుపులో భాగంగా 24వ రోజు తెల్లవారుజామున 5 గంటలకు అక్రమంగా అరెస్టు చేశారని, ఈ నిరవధిక సమ్మె అక్రమ అరెస్టులతో ఆగదని సమ్మె యధావిధిగా ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేసిన కొనసాగుతుందని చర్చల ద్వారా జేఏసీ రాష్ట్ర కమిటీ ఏదైతే నిర్ణయము తీసుకుంటుందో అప్పటివరకు సమ్మె కొనసాగుతుంది అన్నారు.అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వారి న్యాయమైన డిమాండ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తక్షణమే పరిష్కరించాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు గుగులోతు రామచందర్ ఏఐటీయూసీ మండల వైస్ ప్రెసిడెంట్ అయిత శ్రీరాములు మండల నాయకులు ఎజ్జు భాస్కర్,గుగులోతు శ్రీను, వాసం భద్రయ్య, బానోతు వీరన్న,లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు.