అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి పత్రం పల్లా దేవేందర్ రెడ్డి

అంగన్వాడి సమస్యలు పరిష్కారం చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ కి వినతి పత్రం పల్లా దేవేందర్ రెడ్డి

కొండమల్లేపల్లి సెప్టెంబర్ 29 జనం సాక్షి :
అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని గత 19 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని ప్రభుత్వం వెంటనే సమ్మెలో ఉన్న సంఘాలతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి జరపాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మంత్రిని కోరడం జరిగింది కొండమల్లేపల్లిలో మంత్రి పర్యటన సందర్భంగా అంగన్వాడీలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కి సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ మాత్రం ఎలాంటి హామీ ఇవ్వకపోవడం విచారకరం పెరుగుతున్న దరలకు అనుగుణంగా వేతనాల పెంచడంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్10 లక్షల టీచర్లకు ఐదు లక్షలు హెల్పర్ లకు ఇవ్వాలని కోరిన ప్రభుత్వ స్పందించట్లేదని అన్నారు 19 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు అనంతరం మాట్లాడుతూ అక్రమ అరెస్టులను ఖండించండి మంత్రి సత్యవతి రాథోడ్ దేవరకొండ నియోజవర్గ పర్యటనలో భాగంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లలో పెట్టడం ఎంతవరకు సమంజసమని దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు అంగన్వాడిలు తమ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కార కోసం సమ్మె చేస్తుంటే పరిష్కరించడం చేతగాని ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదని అన్నారు మహిళలని చూడకుండా చీకట్లో ఇండ్లలకు కెళ్ళి తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. మహిళా మంత్రి ఉండి కూడా మహిళల పట్ల మానవతా పదంతో కోణం లో ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమం లో
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యెడమ సుమతమ్మ,ఏఐటియూసి జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి,ఉపాధ్యక్షులు నూనె.వెంకటేశ్వర్లు, అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు వనం రాధిక, జిల్లా ఉపాధ్యక్షురాలు కోట్ల శోభ ,జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మమత, బూడిద జ్యోతి, పరిపూర్ణ, నిర్మల, సూజాత, వెంకటమ్మ, కవిత,భాగ్య, నీలాబాయి,సులోచన,సుశీల, అనిత,పద్మ, అరుంధతి,రేణుక,మేరీ,అనురాధ, దనామ్మ,విజయలక్ష్మి,సీఐటీయూ నాయకులు ఎ. యాదయ్య,ఎన్.నాగరాజు, ఏఐటీయూసీ నాయకులు జె.వెంకట్ రాములు,ఎ.మల్లయ్య బానుబీ,అమ్బాలి,బజిని,కౌసల్య తదితరులు పాల్గొన్నారు