అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని వినతి….
రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి
ఫోటో రైటప్ : వినతి పత్రం అందిస్తున్న దృశ్యం..
వరంగల్ బ్యూరో: ఆగస్టు 26 (జనం సాక్షి)
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి తెలిపారు.
శుక్రవారం అంగన్వాడి గ్రేడ్ – 2సూపర్వైజర్ నియామకాలు వెంటనే చేపట్టాలని, అర్హులైన అంగన్వాడీ ఆయాలకు టీచర్స్ గా పదోన్నతులు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదనపు పనులు అప్పగించ రాదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కూరగాయ బిల్లులు, గ్యాస్ బిల్లులు,ఇంటి అద్దెలు పెంచాలని, మూడు నెలలు ఏరియర్స్ ఇవ్వాలని, కోరుతూ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విలాస కవి నిర్మల, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమాదేవి, జంగం రాణి, సహాయ కార్యదర్శి కృష్ణకుమారి, కోశాధికారి వేదవతి, రాష్ట్ర నాయకులు నాగమణి,సంధ్య, రమ రజిత, కవిత, సునీత, విశ్వనిత, మమత, శారద, లక్ష్మి,ఇందిర ,ప్రశాంతి, అనిత, కమల అంగన్వాడీ నాయకులు పాల్గొన్నారు.