అంగరంగ వైభవంగా  శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు

నాలుగోరోజు కల్పవృక్ష వాహనంపై ఊరేగిన శ్రీవారు
భారీగా తరలివచ్చిన భక్తజనులు
14న గరుడోత్సవానికి ఏర్పాట్లు..ట్రాఫిక్‌ మళ్లింపు
తిరుమల,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
బ్ర¬్మత్సవాల్లో నాలుగో రోజు శ్రీవారు కల్పవృక్ష వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న తిరుమలేశుడిని దర్శించుకుని భక్తులు పులకిస్తున్నారు. కోలాటాలు, నృత్యాలు, శ్రీవారి కీర్తనలతో తిరుమాడ వీధులు పులకించాయి. ఇకపోతే గరుడోత్సవానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.  శ్రీవారి గరుడోత్సవాన్ని పురస్కరించుకుని 13వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఘాట్‌ రోడ్డులో ఎటువంటి ద్విచక్రవాహనాలను అనుమతించరు. ఈనెల 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు నగరానికి వచ్చే వాహనాలను మళ్లించినట్లు తెలిపారు.  శ్రీవారి బ్ర¬్మత్స వాలకు సంబంధించి ఇప్పటికే అర్బన్‌ జిల్లా పోలీసులు తిరుమలలో పార్కింగ్‌ ప్రదేశాలను సూచించారు.  బ్ర¬్మత్సవం పార్కింగ్‌ ట్రాకర్‌ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతోపాటు తిరుపతిలో ట్రాఫిక్‌ డీఎస్పీ సుకుమారి ఆధ్వర్యంలో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలను చేపట్టారు. ప్రస్తుతం పార్కింగ్‌ కోసం అలిపిరి-జూపార్క్‌ రోడ్డులో నూతనంగా నిర్మించే క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద ఉన్న మైదానంలో టూరిస్ట్‌, ప్రైవేట్‌ బస్సులకు పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.  కార్లు, జీపులకు హరేరామ హరేకృష్ణ రోడ్డులోని తితిదే వినాయకనగర్‌ మైదానంలో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.
అలిపిరి బస్టాండ్‌ సవిూపంలోని పాత చెక్‌పోస్ట్‌ వద్ద ద్విచక్రవాహనాల పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. ద్విచక్రవాహనచోదకులు అలిపిరి పార్కింగ్‌కు చేరుకునేందుకు అలిపిరి మార్గాన్ని ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్‌ డీఎస్పీ సూచించారు. పై మూడు పార్కింగ్‌ ప్రదేశాల నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.  ఎపీఎస్‌ఆర్టీసీ బస్సులను కూడా క్రమబద్దీ కరించారు.  కడప, హైదరాబాద్‌ నుంచి తిరుపతి బస్టాండ్‌కు వచ్చివెళ్లేందుకు కరకంబాడి గ్రామం విూదుగా రమణవిలాస్‌ కూడలి, రేణిగుంట, ఆటోనగర్‌, రామానుజ కూడలి విూదుగా వెళ్లాలి. చిత్తూరు, మదనపల్లి, బెంగళూరు వైపు నుంచి తిరుపతి బస్టాండ్‌కు వచ్చివెళ్లేందుకు తుమ్మలగుంట ఉప్పరపల్లి క్రాస్‌, వైకుంఠపురం, ముత్యాలరెడ్డిప్లలె, అన్నమయ్య కూడలి, శంకరంబాడి కూడలి, రామానుజ కూడలి, పూర్ణకుంభం కూడలి విూదుగా వెళ్లాలి. కర్ణాటక, తమిళనాడు ఆర్టీసీ బస్సులు ఎపీఎస్‌ఆర్టీసీ బస్టాండ్‌లో వారికి కేటాయించిన స్థలంలోనే పార్కింగ్‌ చేసుకోవాలి. ఎపీఎస్‌ఆర్టీసీ బస్సులు బయట ప్రదేశాల్లోగాని, నగరంలోపల రహదారులపై పార్కింగ్‌ చేయకూడదు. బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చిపోయే కర్ణాటక బస్సులు తిరుపతి భైరాగిప్టటెడ ఆర్చ్‌ దగ్గర తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్‌ నుంచి రాకపోకలు సాగించాలి.  లీలామహల్‌ కూడలి నుంచి కరకంబాడి మార్గం, బాలాజీకాలనీ, టౌన్‌క్లబ్‌, గరుడాసర్కిల్‌ మార్గములో ఆర్టీసీ బస్సులను అనుమతించరు. ఈ నిబందనలు పాటించాలని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.

తాజావార్తలు