అంజలి స్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ :విద్యార్థులకు స్వీయ అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు అంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అలక సైదిరెడ్డి, డైరెక్టర్ సుంకర క్రాంతికుమార్ లు అన్నారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.ఒక్కరోజు పాలనలో విద్యార్థులు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులుగా తమ బాధ్యతలను పూర్తిస్థాయి అవగాహనతో నిర్వహించారన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలలో నిలవాలని వారు ఆకాంక్షించారు. సీఎంగా జి .జస్వంత్, విద్యాశాఖ మంత్రిగా ఎస్. సింధు, విద్యుత్ శాఖ మంత్రిగా జి. హైందవి, ఎంపీగా సిహెచ్. రామ్ చరణ్, ఎమ్మెల్యేలుగా పి. వంశీ,వి. సుమంత్, కె.సిరి మోక్షజ్ఞ, ఎమ్మెల్సీగా సాయి,జడ్పీ చైర్మన్ గా లిఖిత,కలెక్టర్ గా బెనజీర్, జాయింట్ కలెక్టర్ గా పూజిత, ఆర్డీవో గా షబానా,మున్సిపల్ చైర్మన్ గా సంజయ్,జడ్పిటిసి గా పవన్ లు వ్యవహరించారు. అనంతరం స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.