అంతరపంటలతో అధిక దిగుబడులు

తృణధాన్యాలు పండించేలా రైతులకు ప్రోత్సాహం

భూపాలపల్లి,జూలై31(జ‌నం సాక్షి): అంతర పంటలు వేసుకోవడం వలన కలిగే లాభాలను రైతులు తెలుసుకోవాలని జిల్లా వ్వయసాధికారులు రైతులకు సూచించారు. వర్షాభావ పరిస్తితుల్లో ఇది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. తృణధాన్యాలు పండించడం వల్ల ప్రజలకు ఆహార భద్రత కలుగడంతో పాటు నేలసారవంతమై పంట దిగుబడులు అధికంగా వస్తాయని తెలిపారు. రైతులను ఉద్యానవన పంటలలో ప్రోత్సహించాలని, జిల్లాలో తృణధాన్యాలు, పప్పులు, ఆహార పంటల విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ వ్యవసాయ శాఖ అధికారులను ఇటీవల ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పంటలు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో వరి పంట విస్తీర్ణం సాధారణంగానే ఉన్న ముతక, తృణధాన్యాలు, పప్పు ధాన్యాల పంటలతో చాలా వెనుకబడి ఉంది. జిల్లాలో వరిధాన్యం, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, నూనెగింజలు, మొక్కజొన్న, తదితర పంటలను పండించేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి వ్యవసాయ శాఖ అధికారి వద్ద వారి పరిధిలో గల రైతులకు సంబంధించిన పంటల వివరాలు పూర్తిగా ఉండాలన్నారు. అలాగే వర్షాభావం ప్రాంత అభివృద్ధి కార్యక్రమం ద్వారా జిల్లాలో అతి తక్కువ వర్షం పడే రెండు గ్రామాలను గుర్తించి ఆ గ్రామంలో రైతులు అభివృద్ధి సాధించేందుకు ఉద్యాన వన పంటలు, కూరగాయలు, పాడి గేదెలు, ఆవులు, కోళ్లు పెంపకం తదితర కార్యక్రమాలను ప్రయోగత్మకంగా చేపట్టి విజయవంతం చేయాలని అన్నారు. వ్యవసాయ పంటల

విధానంతో పాటు మార్పులపై రైతులకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి కే అనురాధ తెలిపారు.