అంతరాష్ట్ర ఆటో దొంగల ముఠాను అరెస్టు చేసిన గద్వాల్ పోలీసులు

అంతరాష్ట్ర ఆటో దొంగల ముఠాను అరెస్టు చేసిన గద్వాల్ పోలీసులు

గద్వాల ఆర్ సి. సెప్టెంబర్ 30 (జనం సాక్షి),

విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 29న సాయంత్రం నాలుగు గంటల సమయంలో గద్వాల్ దగ్గర అయిజ రింగ్ రోడ్డు వద్ద గద్వాల టౌన్ పోలీస్ లు, సీసీ ఎస్ పోలీసులతో కలసి ఆటోలు దొంగతనం చేసే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళుతుండగా పట్టుకొని వారి దగ్గర నుండి 12 ఆటో లను స్వాధీనం చేసుకోవడమైనది.గద్వాల పట్టణ సుంకులమ్మ మెట్టు కాలనీకి చెందిన పకృద్దిన్ తండ్రి అబ్దుల్ జలిల్ వయసు 32 సం “లు, వృత్తి ఆటో డ్రైవర్ అను వ్యక్తి తన ఆటో కనిపించక పోవడం తో గద్వాల్ పట్టణంలో 4 వ తేదీన పిర్యాదు ఇవ్వగా గద్వాల్ పట్టణ పి ఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది.ఇట్టి కేసును ఛేదించేందుకు జిల్లా ఎస్పీ కె.సృజన ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఏన్ రవి సూచనల ప్రకారం,డి ఎస్పీ వెంకటేశ్వర్లు ,సిఐ శ్రీనివాసులు
పట్టణ ఎస్సైలు సిసి ఎస్ ఇన్స్పెక్టర్ భగవంత్ రెడ్డి అధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేసి శ్రీకాంత్, ఐటి కోర్ ఎస్సై రజిత, కలిసి సాoకేతిక పరిజ్ఞానముతో ఇట్టి కేసును చేదించడం జరిగింది. ప్రెస్ మీట్ అనంతరం నిందితులను కోర్టు లో హాజరుపరచి రిమండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు.ఈ కేసును చెదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సీసీ ఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ భగవంత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ రంజిత్, శ్రీనివాసులు, కానిస్టేబుల్ ప్రసాద్, భరత్, సీసీ కెమెరా సిబ్బంది చంద్రయ్య, రామకృష్ణ, రమేష్ చారిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా క్యాష్ రివార్డ్ తో అభినందించడం జరిగింది.