అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

నగరంలో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను మల్కాజిగిరి ఎస్ఓటి,నేరెడ్ మెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారని రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేరెడ్ మెట్ లోని సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన నలుగురు స్నేహితులు ఒక ముఠాగా ఏర్పడి నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాజస్థాన్ నుండి మత్తు పదార్థాలు దిగుమతి చేసి అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పక్కా ప్రణాళికతో నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుండి 750 గ్రాముల ఓపిఎం,500 గ్రాముల పాపిస్తా,ఒక కారు స్వాధీనం చేసుకున్నారని వీటి విలువ 12.5 లక్షలు ఉంటుందని తెలిపారు.మరో కేసులో బెంగళూరు నుండి హైదరాబాదు కు మత్తుపదార్థాలు సరఫరా చేస్తున్న నలుగురిని ఎల్బీనగర్ ఎస్ఓటి,సరూర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారని వీరి నుండి 12 గ్రాముల హెరాయిన్,నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు.