అంబర్‌పేటలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
హైదరాబాద్,సెప్టెంబర్18(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం అభినందనీయమని నగరంలోని అంబర్ పేట్ కార్పొరేటర్ అన్నారు.
అంబర్ పేట్ మండల కార్యాలయంలో 129 చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో ఆడబిడ్డ పెళ్లికి ఏ తండ్రికీ భారం కాకూడదని సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ సంక్షేమ పథకాన్ని పక్కాగా అమలు చేస్తూ లబ్దిదారులకు చెక్కులను అందజేస్తున్నారు. అంబర్ పేట్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల లబ్దిదారులకు ఇప్పటివరకు కోట్ల రూపాయలు పంపిణీ చేశామన్నారు. పెండింగ్ లో ఉన్న చెక్కులను వెంటనే అందజేయడం జరుగుతుందన్నారు. పెళ్లికి 15 రోజుల ముందు కళ్యాణ లక్ష్మీ పథకానికి దరఖాస్తూ చేసుకోవాలని సూచించారు.