– అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందింజేత.
– పాల్గొన్న(6వ వార్డు)పాండవ బస్తీ మహిళలు .
బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో 8వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. దీక్షలో 6వ వార్డు పాండవ బస్తి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని సాగుతున్న నిరవధిక రిలే నిరాహార దీక్షలో భాగంగా శుక్రవారం దీక్షలో పాల్గొన్న మహిళలందరూ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మా ముంపు బాధితుల సమస్యలు త్వరగా పరిష్కారం కావాలని ఆకాంక్షిస్తూ వినతి పత్రం అందింజేశారు. దీక్షలో పాల్గొన్న మహిళలకు మాజీ జెడ్పిటిసి సభ్యులు భూపల్లె నరసింహారావు, చెన్నం దామోదర్, సిపిఎం నాయకులు రాయల వెంకటేశ్వర్లు మహిళలకు పూల మాలలు అందించి దీక్షను ప్రారంభించారు. అనంతరం భూపల్లి నరసింహారావు మాట్లాడుతూ పోలవరం నిర్మాణంతో దాని నిల్వ నీటి వలన ఎన్నో వందల గ్రామాలు మునిగిపోతున్నాయని, తద్వారా ముంపు బాధిత గ్రామాల జనజీవనం అస్తవ్యస్తం అవుతున్నదని, దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించి బాధిత గ్రామస్తులకు తగు న్యాయం చేయాలన్నారు. జె ఏ సి కన్వీనర్ కె.వి రమణ, ప్రధాన కార్యదర్శి దామర శ్రీనివాసరావు, మహిళ ఇంచార్జ్ కుంజా వెంకటరమణ, గౌరవ సలహాదారులు గోనెల నరసింహారావు, గోనెల చిన్న సడలు, జక్కం సుబ్రహ్మణ్యం, డాక్టర్ లక్కోజు విష్ణువర్ధన్, ఎస్ కే బాబా, ఎడారి దుర్గ, చార్మినార్ కేఫ్ ఓనర్ నజీరుద్దీన్, సిపిఎం నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు, మహమ్మద్ మున్నా, దాసరి సాంబ, రాజేశ్వర్ రెడ్డి, ముదిగొండ బాలకృష్ణ, మంద నాగరాజు, బర్ల తిరుపతిరావు,
పుట్టి చంద్రకళ, బర్ల ఉపేంద్రమ్మ, పుట్టి ఈశ్వరమ్మ, బుయ్యన ఆదెమ్మ, పాండవ బస్తీ మహిళలు దీక్ష లో పాల్గొన్నారు.