అక్టోబర్ 12నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
– 95లక్షల చీరల పంపిణీకి ఏర్పాట్లు
– ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్27(జనంసాక్షి) : అక్టోబర్ 12నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం బతుకమ్మ చీరలను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం కేటీఆర్ విూడియాతో మాట్లాడారు. ఈ ఏడాది 95 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలకు 49లక్షల చీరలు పంపిణీ చేశామన్నారు. 80రకాలైన రంగులలో జరీ అంచు పాలిస్టర్‌తో చీరలను తయారు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఒక్కో చీర ఖరీదు రూ. 290 కాగా.. చీరల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చివరి చీరను చివరి మహిళకు ఇచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఈ చీరలు అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నానని చెప్పిన కేటీఆర్.. చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అక్టోబర్ 12నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో గురువారం మాసబ్‌ట్యాంక్ పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ తిలకించారు. 80 రకాల రంగులలో జరీ అంచు పాలిస్టర్‌తో చీరలు తయారయ్యాయి. ఇప్పటివరకు 40 లక్షల చీరలను అధికారులు జిల్లాలకు తరలించారు.