అక్టోబర్ మాసం నుండి కొత్త మద్దతు ధరలు అమలు – ఎ. ఎం. సీ చైర్మన్ దాసరి రాజలింగు

జనంసాక్షి , కమాన్ పూర్ : రైతులు తాము పండించిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ ఆవరణలోనే అమ్మకాలు జరిపీ మద్దతు ధరలు పొందాలని, దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించి నష్ట పోవద్దని కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు, వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు ఇనంగంటి భాస్కర్ రావులు కోరారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
అక్టోబర్ మాసంలో కేంద్ర ప్ర భుత్వం అమల్లోకి తెచ్చిన పంటలకు కొత్త మద్దతు ధరలు అమల్లోకి రాబోతున్నాయని, కనీస మద్దతు ధర అమలులోకి వస్తున్నందున్నారు.17 రకాల పంటలపై కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే రైతులకు మంచి ధర వస్తుందన్నారు.
వరికి రూ.2040 నుంచి రూ.2203 పెంచారని, మొక్కజొన్నలు రూ.1962 నుంచి రూ.2090 ధర పెరిగిందన్నారు. మండల రైతులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసుకోవాలని కోరారు.
ఆధార్ ప్రామాణికరణ జరిగిన తర్వాత పత్తి పంట కొనుగోలు పక్రియ మొదలవుతుందని ఆధార్ ప్రమాణికరణ జరిగిన పక్షంలో పంట కొనుగోలు చేయకూడదని పంట కొనుగోలు కేంద్రం నుంచి తిరిగి వెనక్కి పంపబడుతుందన్నారు
పత్తి పంట కనీస మద్దతు ధర పొందాలంటే రైతు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలన్నారు.
రైతులు తాము పండించిన పంటలను మద్దతు ధరకు విక్రాయించడానికి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆధార్ తో అనుసంధానం కలిగిన మొబైల్ నంబర్ ఒక్కటి మాత్రమే ఒక్క పట్టాదారునికి ఉండాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన పట్టాదారులు వారు ఎవ్వరికి వారే తమకు సంబంధించిన ఆధార్, మొబైల్ నంబర్తో అనుసంధానం కలిగి ఉండాలని సూచించారు.
దాన్యం, పత్తితో పాటు ఇతరత్ర పంటలు మద్దతు ధరతో విక్రయించేందుకు, లావాదేవీలు నిర్వహించడం కోసం అనుకూలంగా ఉంటుందాన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకాకుండా ఉంటాయన్నారు.
రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ, పి. ఎం కిసాన్ వంటి సందేశాలతో పాటు మరెన్నో విలుఏవైనా సమాచారాలు రైతులకు చేరుటాయాన్నారు.
రైతులు తమ ఫోన్ నంబర్ మార్చిన యెడల మరల వెంటనే ఆధార్, బ్యాంక్ ఖాతాలతో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందాన్నారు.
కొనుగోలు కేంద్రాలకు వెళ్లే ముందు రైతులు తమకు సంబంధించిన అన్ని ధ్రువీకారణ పత్రాలతో పాటు ఆధార్, మొబైల్ నంబర్లు అనుసంధానం పై సరి చూసుకోవాలని కోరారు.
ప్రతి ఒక్క రైతు ఈ. కే. వై. సీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ నియమ నిబంధాలను రైతులు పాటించి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని కోరారు.
ఈ విలేకర్ల సమావేశంలో..
ఎ. ఎం. సీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, ఉపాధ్యక్షులు పెండ్లి నారాయణ, కమాన్ పూర్ సర్పంచ్ నీలం సరిత, డైరెక్టర్ లు స్వప్న, లింగారెడ్డి, కమాన్ పూర్, ముత్తారం ఎ. వో లు ప్రమోద్ కుమార్, శ్రీకాంత్, ఎ. ఎం. సీ సెక్రటరీ ఈర్ల సురేందర్ పాల్గొన్నారు.