అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ఏలూరు,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మఠంగూడెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్‌ బియ్యాన్ని మంగళవారం విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఏలూరు విజిలెన్స్‌ ఎస్పి డి.అచ్యుతరావుకి వచ్చిన సమాచారం మేరకు.. ఖమ్మం జిల్లా నుంచి ఏలూరుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం లారీని మంగళవారం తెల్లవారు జామున లింగపాలెం మండలం మట్టంగూడెం గ్రామంలో విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్‌ సిఐ ఎండి భాస్కరరావు గోపాల్‌, గ్రామ రెవెన్యూ కార్యదర్శిలు కలిసి తనిఖీలు నిర్వహిస్తూ.. లారీని ఆపి సోదా చేశారు. లారీలో సుమారు 14 టన్నుల రేషన్‌ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు విజిలెన్స్‌ అధికారులు కనుగొన్నారు. లారీని స్వాధీనం చేసుకున్నారు.