అక్రమాలను వెలికితీస్తే సస్పెండ్ చేస్తారా.
ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ(OPDR) ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్సమాచార హక్కు చట్టం ద్వారా అక్రమాలను వెలికితీస్తే అభినందించాల్సింది పోయి సస్పెండ్ చేయడం అధికారులకే చెల్లిందని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాల మహేందర్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో సమాచార హక్కు చట్టం కార్యకర్త ఉపాద్యాయుడు మహ్మద్ అష్రఫ్ ను సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని, సమాచారం హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అన్యాయల్ని, అక్రమాలను వెలికితీసి ప్రజల ముందు దోషిగా నిలబెడితే అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి నిజాల్ని వెలికితీసిన వారిపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించమే అన్నారు. ఉపాద్యాయుడు అష్రఫ్ సమాచార హక్కు చట్టం ద్వారా వందలాది అక్రమాలను వెలికితీసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడినందుకు అభినందించి సత్కరించాల్సిన అధికారులు తమ తప్పులు ఎత్తి చూపాడని సస్పెండ్ చేయడం వల్ల కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో అధికారులు అవినీతి, అక్రమాలు ఏరీతిన ఉన్నాయో ఈ చర్యల ద్వారా అర్థం అవుతుందన్నారు. అవినీతి అధికారులను శిక్షించాల్సిన ఉన్నతాధికారులు ఇలా రాజ్యాంగ విరుద్ధంగా, రూల్ ఆఫ్ లా కు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సమాచార కార్యకర్త, ఉపాద్యాయుడు అష్రఫ్ పై సస్పెన్షన్ ఎత్తివేసి తమ నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.