అక్రమ అరెస్టులు కాదు,సమస్యలు పరిష్కరించండి

అక్రమ అరెస్టులు కాదు,సమస్యలు పరిష్కరించండి

టేకులపల్లి, సెప్టెంబర్ 30( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా సమస్యల పరిష్కారం కోసం పోరాడే నాయకులను మంత్రుల పర్యటనల నెపంతో ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని,ఈ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.భాస్కరరావు,ఎం.రమణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి పర్యటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నదనే కారణంతో ఉపాధ్యాయ,ఉద్యోగుల సంక్షేమం, ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్ ను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యబద్ధంగా వారికున్న హక్కును,స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని,ఐఆర్ ను ప్రకటించకుండా,రావలసిన మూడు పెండింగ్ డీఏలను విడుదల చేయకుండా ఉపాధ్యాయ ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్నదని, వెంటనే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ఏరియాలో రాజ్యాంగబద్ధంగా 5వ షెడ్యూల్ ప్రకారం గిరిజనులకు,గిరిజన ఉపాధ్యాయ ఉద్యోగులకు చెందాల్సిన హక్కులు కాలరాస్తున్నప్ప టికీ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి పట్టించు కోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నదని,గిరిజన చట్టాలను, గిరిజన హక్కులను కాపాడాలని,రాష్ట్రంలో అంగన్వాడీ సిబ్బంది,ఆశా వర్కర్లు,మధ్యాహ్న భోజన వర్కర్లు వారి న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెలు,ధర్నాలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడం లేదని,వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరి