అక్రమ అరెస్టుల వైఖరిని మార్చుకోవాలి..
– కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్ చెవిటి లింగం
చేర్యాల (జనంసాక్షి) జులై 21 : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ని ఈ.డి ఆఫీసుకు విచారణకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు. హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ ఇందిరమ్మ విగ్రహం నుంచి ఈ.డి కార్యాలయం వరకు ర్యాలీ,ధర్నా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఉదయాన్నే ఇంటికి వచ్చి అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 2వ వార్డు కౌన్సిలర్ చెవిటి లింగం అన్నారు. ఈ సందర్భంగా లింగం మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ కుట్రలను దేశ ప్రజలు గమనిస్తున్నారని కక్ష సాధింపుపై రాజీలేని పోరాటం తప్పదన్నారు. ఈడీ ముసుగులో బీజేపీ కక్ష సాధింపు రాజకీయానికి అంతిమ ఘడియలు మొదలయ్యాయని, కాంగ్రెస్ అగ్రనేతలను అక్రమ కేసులతో వేధించడాన్ని సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ శ్రేణుల సహనానికి ప్రభుత్వాలు పరీక్షపెడుతున్నాయి. బీజేపీకి వత్తాసుగా కేసీఆర్ ప్రభుత్వం మా శ్రేణుల పైకి ఖాకీలను ఉసికొల్పింది. ఐనా పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో దేశంలో నియంత పాలన అంతానికి కాంగ్రెస్ కదం తొక్కుతుందని, పోలీసులు అక్రమ అరెస్టుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెవిటి లింగం అన్నారు. అరెస్టైన వారిలో మాజీ జడ్పీటీసీ కొమ్ము నర్సింగ రావు, కౌన్సిలర్లు ముస్త్యాల తార-యదగిరి, సందుల సురేష్, కాటం శ్రీనివాస్,కురపాటి మధుసూదన్, ఉన్నారు.
Attachments area