అక్రమ నిర్మాణాలు కూల్చాల్సిందే

 

రైతురుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి
భూమాత పోర్టల్‌పై ప్రజల్లో చర్చ పెట్టాలి
పూర్తిస్థాయి రుణమాఫీ కోసం 29న ధర్నాలు
విూడియాతో సిపిఎం నేతలు తమ్మినేని, బివి రాఘవులు
హైదరాబాద్‌,ఆగస్ట్‌24 (జనంసాక్షి):

ఎక్కడ అక్రమాలు ఉన్నప్పటికీ కూల్చివేయడం మంచి నిర్ణయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడిరచారు. హైడ్రాపై సీపీఎం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో శనివారం విూడియాతో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ… గతంలో బీఆర్‌ఎస్‌ మాదిరి కాకుండా.. ఆక్రమణలు మొత్తం కూల్చివేయాలని చెప్పారు. ఆక్రమణలు చేస్తున్న వారికి అనుమతించిన అధికారులను కూడా శిక్షించాలని చెప్పుకొచ్చారు. భూమాత పోర్టల్‌పై రైతుల్లో చర్చ పెట్టాలని అన్నారు. రుణమాఫీని పక్కదోవ పట్టించటానికి మంత్రులు, సీఎంలు, మాజీ సీఎంలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు అందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ. 2లక్షలు రుణమాఫీ చేస్తే రూ.31,000 కోట్లు ఖర్చు అవుతుందని కాంగ్రెస్‌ నాయకులు చెప్పారని తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇప్పుడు రూ. 18,000 కోట్లు రుణమాఫీ చేసి పూర్తిగా రుణమాఫీ అయ్యింది అంటే ఎలా? అని ప్రశ్నించారు. రుణమాఫీకి రేషన్‌ కార్డు అవసరం లేదని రేవంత్‌ రెడ్డి నోటిమాట చెప్పారని అన్నారు. కానీ రుణమాఫీ కావాలంటే అధికారులు రేషన్‌ కార్డు అడుగుతున్నారని తెలిపారు. రైతులకు ఇచ్చిన హావిూలుఅమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 29తేదీన రెవెన్యూ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తున్నామని తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు సీఎం పర్యటనలు ఉంటే తమ సీపీఎం నేతలను ముందస్తు అరెస్ట్‌ చేశారని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటనలు ఉంటే కూడా ముందస్తు గా సీపీఎం నేతలను అరెస్ట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కేసీఆర్‌ అవలంబించిన విధానాలను కాంగ్రెస్‌ కొనసాగాస్తుందని ఆరోపించారు. రెండు గ్రామాల్లో రుణమాఫీపై స్టడి చేశామని తెలిపారు. 1100 మందికి 300మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని తెలిపారు. కాంగ్రెస్‌. బీజేపీని వదిలేసి బీఆర్‌ఎస్‌ వెంట పడుతుందని తెలిపారు. దీని వల్ల కాంగ్రెస్‌ నష్ట పోతుందని.. గతంలో కూడా బీఆర్‌ఎస్‌ ఇలాగే నష్టపోయిందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బీజేపీ మతతత్వ ఆలోచనలను కొనసాగిస్తుందని సీపీఎం పాలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. వక్ఫ్‌ బోర్డు చట్టాన్ని సవరణ చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు. వక్ఫ్‌ బోర్డు చట్టంలో అభ్యంతరకరమైన మార్పులు తీసుకు రావాలని బీజేపీ చూస్తుందని విమర్శలు చేశారు. వక్ఫ్‌ బోర్డులో ఇతర మతస్తులను కమిటీలో పెట్టాలని చూస్తున్నారని విమర్శలు చేశారు. మతాల మధ్య విభజన తేవాలని బీజేపీ చూస్తోందని ఆరోపణలు చేశారు. ªూబోయే కొన్ని రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని బీజేపీ కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో తీసుకువచ్చిన బిల్లు చాలా ఘోరంగా ఉందని అన్నారు. దేశంలో అగ్రీస్‌ యాక్ట్‌ అమలు చేయాలని కేంద్రం చూస్తుందని అన్నారు. ఈ యాక్ట్‌తో రైతుల డేటా అంత ప్రైవేట్‌ కంపెనీల పరం అవుతుందని అన్నారు. నల్ల చట్టాలను పరోక్షంగా అమలు చేయాలని బీజేపీ పనిగట్టుకుందని ధ్వజమెత్తారు. భూమాత పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకువస్తుందని ఆరోపించారు. భూ మాతపై రైతులలో చర్చ పెట్టిన తర్వాత అమలు చేయాలనిబీవీ రాఘవులు డిమాండ్‌ చేశారు.