అగ్రిగోల్డ్‌పై కపటనాటకాలు

విజయవాడ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): సీమ సమస్యలపై సిఎం చంద్రబాబుకు చిత్తశుద్ది లేదని సిపిఐ నేత జగదీశ్వర్‌ అన్నారు. సీమకు జలాల పంపిణీలో అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

సీబీఐ ప్రతిష్టని దిగజార్చిన ఘనత మోడికే దక్కుతుందని విమర్శలు గుప్పించారు. సీబీఐ అధికారుల అవినీతిపై దర్యాప్తు సిగ్గుచేటన్నారు. రాఫెల్‌ స్కాం, సీబీఐ అవినీతి, ఇతర అంశాలపై జిల్లాలో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్‌పై టీడీపీ, బీజేపీ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఈ రెండు పార్టీలు చేసిందేవిూ లేదన్నారు. ఇదిలావుంటే ‘అరవింద సమేత’ సినిమాలో రాయలసీమను కించపర్చే అంశాలు లేవని వ్యాఖ్యానించారు. ఇటీవల ఈ సినిమాను కొందరు కావాలని విమర్శలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. ఓ రకంగా ఈ సినిమా రాయలసీమ శాంతిని కోరుకునే వారికి ఉత్తేజాన్నిఇచ్చేలా ఉందన్నారు.